ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:16 PM
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా ఆడిన నాలుగు మ్యాచుల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్ఆర్.. రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు మూడు మ్యాచుల్లో ఓడి ఏడో స్థానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్.. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ ‘పులి’ అభిషేక్ శర్మ ఓ వైపు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోవైపు.. వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడనున్నారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), ప్రిటోరియస్, డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హిట్‌మేయర్, రవి సింగ్, శుభమ్ దూబె, బ్రిజేష్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్, ప్రఫుల్, ఎషాన్ మలింగ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: స్మరన్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్, లియామ లివింగ్‌స్టోన్, శివం మావి, హర్షల్ పటేల్
ఇవి కూడా చదవండి:
ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్
రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు