Share News

వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:14 PM

ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తానియా ఛటర్జీ అనే నటి చేసిన సంచలన ఆరోపణల కారణంగా చాహల్ వార్తల్లో నిలిచాడు.

వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!
Yuzvendra Chahal

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. చాహల్ తనకు ఇన్‌‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్ పంపాడంటూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న తానియా ఛటర్జీ సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోలో తానియా తన ఫోన్‌ను మీడియా ప్రతినిధులకు చూపిస్తూ.. తన ఫొటోలకు చాహల్ స్పందిస్తూ.. 'మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు' అని మెసేజ్ చేసినట్లు పేర్కొంది. చాహల్ పంపిన మెసేజ్‌ను తాను చాలా ఆలస్యంగా చూశానని, అందుకే రిప్లై ఇవ్వలేదని తానియా తెలిపింది. ఈ సమయంలో కెమెరామెన్లు ఆమెను ఆటపట్టిస్తుండగా.. తానియా సిగ్గుపడుతూ కనిపించింది. అయితే ఈ ఆరోపణలపై యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఉల్లు, గందీ బాత్ వంటి ఓటీటీ సిరీస్‌ల ద్వారా తానియా ఛటర్జీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.


ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యుజ్వేంద్ర చాహల్ ప్రవర్తనను తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్న పని అని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఏఐ కాలంలో ఇలాంటి ఫేక్ చాట్‌లు సృష్టించడం పెద్ద కష్టమేమీ కాదని, వార్తల్లో నిలవడానికి నటి ఇలాంటి పనులు చేస్తోందని చాహల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొడవలు జరుగుతున్నా, చాహల్ తన ప్రదర్శనపై మాత్రం ప్రభావం పడనీయడం లేదు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్.. 224 వికెట్లతో ఐపీఎల్ చరిత్రలోనే టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్

రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 13 , 2026 | 04:45 PM