ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 03:38 PM
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. తాజాగా రోహిత్ గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అప్‌డేట్ ఇచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ గాయం ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. తాజాగా రోహిత్ గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అప్‌డేట్ ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. 'రోహిత్ తొడ కండరాలు పట్టేసినట్లు అనిపిస్తోంది. కానీ కచ్చితంగా నాకు తెలియదు. వైద్యులు కూడా రోహిత్ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్‌ల కోసం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్‌నెస్ గురించి త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది' రూథర్‌ఫర్డ్ పేర్కొన్నాడు.
ఒకవేళ రోహిత్ గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉంటే పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు వారాల సమయం పడుతుందని క్రీడా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్ 2026 మధ్యలోనే వైదొలిగే అవకాశముందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.. ఏదేమైనప్పటికి రోహిత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అతడి అభిమానులు, ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్ ఆశిస్తున్నారు.
అసలేం జరిగిదంటే...
రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ 6వ ఓవర్‌లో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేశాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్‌ను పరీక్షించాడు. అయినా ఏ మాత్రం రోహిత్ తొడ కండ నొప్పి తగ్గలేదు. దీంతో అదే ఓవర్‌లో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.
ఇవి కూడా చదవండి:
48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు
సన్ రైజర్స్ జట్టులోకి ఊహించని బౌలర్ రీ ఎంట్రీ!