Share News

ఐపీఎల్2026: సన్ రైజర్స్ జట్టులోకి ఊహించని బౌలర్ రీ ఎంట్రీ!

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:38 PM

వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

ఐపీఎల్2026: సన్ రైజర్స్ జట్టులోకి ఊహించని బౌలర్ రీ ఎంట్రీ!
Shivam Mavi

స్పోర్ట్స్ డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈక్రమంలో హైదరాబాద్ జట్టులోకి ఊహించని ఓ బౌలర్ రీఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. జయదేవ్ ఉనద్కత్‌ బదులు టీమిండియాకు ఆడిన శివం మావిని రంగంలోకి దిగనున్నట్లు క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


శివం మావి పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు కూడా తీయగలడు. 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన శివం మావి.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీయగలిగాడు. చివరగా 2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ శివం మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతడికి రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుందేమో చూడాలి. అలా దక్కితే మాత్రం నాలుగేళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినట్లు అవుతోంది.


సన్‌రైజర్స్‌ తుదిజట్టు అంచనా

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్‌ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్‌/శివం మావి.


ఇవి కూడా చదవండి:

ఎంఐతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయం.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నాడంటే?

రోమి బిందర్ ఫోన్ వినియోగించడానికి అదే కారణం!

Updated Date - Apr 13 , 2026 | 03:26 PM