Share News

పోలింగ్ సెంటర్లలో బయోమెట్రిక్.. కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు..

ABN , Publish Date - Apr 13 , 2026 | 03:10 PM

దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్‌ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, అడ్వకేట్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

పోలింగ్ సెంటర్లలో బయోమెట్రిక్.. కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు..
Supreme Court biometric voting

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్‌ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, అడ్వకేట్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్‌మాల్యా బాగ్చీ తేల్చిచెప్పారు.


అయితే.. తదుపరి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే బయోమెట్రిక్ అనుసరించడం సమంజసమేనా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. మొదట ఈ పిటిషన్‌పై విచారణ జరపటానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లమని పిటిషనర్‌కు న్యాయమూర్తులు సూచించారు. తాను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడటం లేదని పిటిషనర్ తెలిపారు. దీంతో న్యాయమూర్తులు పటిషన్‌పై విచారణకు అంగీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించవచ్చా లేదా అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు.


ఇవి కూడా చదవండి

48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు

సమ్మెపై ఆలోచించండి.. తొందరపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

Updated Date - Apr 13 , 2026 | 04:15 PM