Share News

సమ్మెపై ఆలోచించండి.. తొందరపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:56 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేసినట్లు తెలిపారు. మిగతా అంశాలు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

సమ్మెపై ఆలోచించండి.. తొందరపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. రెండు అంశాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. కమిటీ నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కార్మికులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేసినట్లు తెలిపారు. మిగతా అంశాలు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని.. తొందర పడవద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.


సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్‌తో చర్చలు జరపాలని నిర్ణయించారు. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉంది . ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నట్లు సమాచారం. మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ పోస్టులు.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 03:27 PM