Share News

దళిత డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:48 AM

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ఏ2 నిందితురాలిగా ఉన్నారు.

దళిత డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు
YCP MLC Anantababu

రాజమండ్రి, ఏప్రిల్ 13: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ఏ2 నిందితురాలిగా ఉన్నారు. ఆమెను కేసు నుంచి తొలగించాలని కోరుతూ రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరగనున్నాయి. బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించనున్నారు.


2022లో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1 నిందితుడిగా ఉండగా, ఆయన భార్య లక్ష్మీ దుర్గను ఏ2గా సిట్ తన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో చేర్చింది. హత్య తర్వాత ఆధారాలను ధ్వంసం చేయడం, శవాన్ని డోర్ డెలివరీ చేయడంలో ఆమె పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. లక్ష్మీ దుర్గ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీ దుర్గ సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా.. ఈ కేసు నుంచి లక్ష్మీ దుర్గను తొలగించాలంటూ రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి

న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. పెళ్లి చేసుకోవాలంటూ..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 11:56 AM