కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి
ABN , Publish Date - Apr 13 , 2026 | 09:32 AM
కోతల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
ములుగు, ఏప్రిల్ 13: ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కోతులు తరచూ ఇళ్లలోకి వచ్చి ఆహారం, సామగ్రి ఎత్తుకెళ్తుండటంతో స్థానికులు వాటిని దూరం చేయడానికి విషం కలిపిన ఆహారాన్ని బయట పెట్టారు. ఆ విషాహారం తిన్న నాలుగేళ్ల చిన్నారి అశ్విన్ నందన్ అస్వస్థతకు గురయ్యాడు.
బాలుడిని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..
శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం
Read Latest Telangana News And Telugu News