Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..

ABN , Publish Date - Apr 13 , 2026 | 07:55 AM

ఉత్తరప్రదేశ్‌ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..
Hapur Road Accident

ఉత్తరప్రదేశ్‌: హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు హాపూర్ వద్ద ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో బస్సులో మెుత్తం 12 మంది ఉన్నారని, అందులో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు హాపుర్ ఎస్పీ జ్ఞానంజయ్ తెలిపారు.


ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి సమాచారం తెలియాల్సి ఉందని, అతను డ్రైవరై ఉండొచ్చని ఎస్పీ వెల్లడించారు. అయితే, ప్రమాదం గురించిన తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రక్కును తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదంతో ధౌలానా - గులావతి రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.


ఈ వార్తలు కూడా చదవండి

50 శాతం సీట్ల పెంపునకు.. దక్షిణాదిలో 40 శాతం మద్దతు!

సర్జరీ చేసే డ్రోన్‌ ఎస్‌ఎస్‌ విమాన

Updated Date - Apr 13 , 2026 | 08:15 AM