Share News

రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు వద్దు!

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:12 AM

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందులు సూచించడాన్ని నిషేధించడంతో పాటు ఐదేళ్లలోపు పిల్లలకూ వీటి వాడకాన్ని ప్రోత్సహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది.

రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు వద్దు!

  • ప్రిస్ర్కిప్షన్‌లో సిర్‌పలు సూచించడంపై నిషేధం

  • ఎన్‌ఎఫ్‌ఐ ముసాయిదాపై ఆరోగ్యశాఖ యోచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందులు సూచించడాన్ని నిషేధించడంతో పాటు ఐదేళ్లలోపు పిల్లలకూ వీటి వాడకాన్ని ప్రోత్సహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. గతఏడాది కల్తీ సిర్‌పల కారణంగా వరుస మరణాలు సంభవించిన నేపథ్యంలో ఇండియన్‌ ఫార్మకోపియా కమిషన్‌ విడుదల చేసిన నేషనల్‌ ఫార్ములరీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎ్‌ఫఐ) 2026 ముసాయిదాలో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. రెండేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు, జలుబు మందులను సిర్‌పల రూపంలో సూచించకూడదని, పంపిణీ చేయకూడదని ఎన్‌ఎ్‌ఫఐ ముసాయిదా పేర్కొంది. సమగ్ర వైద్య పరీక్షలు, నిశిత పర్యవేక్షణ లేకుండా ఐదేళ్ల లోపువారికి కూడా ఇలాంటి మందులు సిఫారసు చేయకూడదని స్పష్టం చేసింది. దీన్ని ఆరోగ్య నిపుణులు, వైద్యులు స్వాగతిస్తున్నారు.

Updated Date - Apr 13 , 2026 | 05:12 AM