Share News

న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. పెళ్లి చేసుకోవాలంటూ..

ABN , Publish Date - Apr 13 , 2026 | 10:11 AM

తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ.. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడంటూ మహిళ వాపోయింది.

న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. పెళ్లి చేసుకోవాలంటూ..
Vijayawada News

విజయవాడ, ఏప్రిల్ 13: న్యూడ్ ఫొటోలతో మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. భవానీపురం ప్రాంతంలో మద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బాధిత మహిళను వేధింపులకు గురిచేశాడు. భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. వెంకటేశ్వర్లు వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంకటేశ్వర్లు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


భవానీపురం జోజి నగర్‌లో మద్దు బాల వెంకటేశ్వర్లు కిరాణా స్టోర్ నడుపుతున్నాడు. అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై బ్లాక్‌మెయిల్, లైంగిక వేధింపులు, బెదిరింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 10:38 AM