Share News

ఆశా భోస్లే భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:14 PM

ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆశా భౌతిక కాయానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అతడి భార్య అంజలితో కలిసి నివాళులు అర్పించాడు.

ఆశా భోస్లే భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 92 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఆశా అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజి పార్క్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆశా స్వగ్రామం ముంబైలో ఉంచారు. ఈ క్రమంలో ఆశా భౌతికకాయానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అతడి భార్య అంజలితో కలిసి నివాళులు అర్పించాడు.


ఆశా భోస్లేతో సచిన్ కుటుంబానికి చాలా కాలంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ సచిన్ కంటతడి పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలిపాడు. అతడితో పాటు ఆశా భోస్లేను చివరిసారిగా చూసేందుకు వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కన్నీటి వీడ్కోలు పలికారు. సంగీత ప్రపంచంలో ఆమె సేవలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు

సన్ రైజర్స్ జట్టులోకి ఊహించని బౌలర్ రీ ఎంట్రీ!

Updated Date - Apr 13 , 2026 | 04:34 PM