Share News

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026.. రికార్డు స్థాయిలో ప్రైజీ మనీ ప్రకటించిన ఐసీసీ

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:55 PM

మహిళల క్రికెట్ చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026.. రికార్డు స్థాయిలో ప్రైజీ మనీ ప్రకటించిన ఐసీసీ
Icc Womens T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల క్రికెట్ చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. దీంతో ఈ టోర్నీకి గ్లోబల్ స్థాయిలో మరింత ప్రాధాన్యం పెరుగనుంది. 2024తో పోలిస్తే ఈ సారి 10శాతం ప్రైజ్ మనీని పెంచడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోర్నీకి రూ.82 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. కాగా ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది.


ప్రైజ్ మనీ వివరాలు ఇలా..

  • విజేతగా నిలిచిన జట్టుకు సుమారు రూ.21.8 కోట్లు

  • రన్నరప్‌కు రూ.10 కోట్లు

  • సెమీఫైనల్లో ఓడిన ఒక్కొక్క జట్టుకు సుమారు రూ.6.29 కోట్ల చొప్పున

  • ఇక ప్రతి గ్రూప్ మ్యాచ్ గెలుపునకు సుమారు రూ.29 లక్షలు


అత్యంత ముఖ్యంగా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ.2.06 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించడం మహిళల క్రికెట్ అభివృద్ధికి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్ జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగనుంది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు పోటీలో ఉండటంతో టోర్నీపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఈ విషయంపై మాట్లాడారు. ‘మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జట్ల సంఖ్య పెంచడంతో పాటు రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీ స్థాయి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్

రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 13 , 2026 | 07:18 PM