Share News

గుజరాత్‌లో ఎన్నికలు.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు!

ABN , Publish Date - Apr 13 , 2026 | 09:00 PM

గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన విడుదల చేశారు.

గుజరాత్‌లో ఎన్నికలు.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు!
IPL-BCCI

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన విడుదల చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన రెండు మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఈ సీజన్ తొలి దశలో ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కారణంగా ఈ మ్యాచ్ వేదికను చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మర్చారు. కాగా మ్యాచ్ జరిగే సమయంలో ఎలాంటి మార్పు లేదు. అదే విధంగా, మే 21న చెన్నైలో జరగాల్సిన రిటర్న్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చారు. ఈ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30గంటలకు నిర్వహించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఈ మార్పులపై ఐపీఎల్ అధికారిక ప్రకటనలో, గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల షెడ్యూల్ సవరించినట్లు తెలిపింది.


గుజరాత్ టైటాన్స్.. రెండు విజయాలు, రెండు ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇటీవల లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా వరుసగా మూడు ఓటముల తర్వాత డిల్లీ క్యాపిటల్స్‌పై తొలి విజయాన్ని నమోదు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. మొత్తానికి, ఎన్నికల ప్రభావంతో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు రావడం జట్ల వ్యూహాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.


ఇవి కూడా చదవండి:

ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్

రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 13 , 2026 | 09:18 PM