Share News

కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:42 PM

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.

కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!
Rahane

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తొలి ఓటమిని చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ ఎలా ఆడతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. కాగా ముంబైపై అతడు బ్యాటింగ్‌లో కేవలం 18 పరుగులే చేయగా.. బౌలింగ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. రూ.25.20 కోట్లతో ఆల్‌రౌండర్ కోటాలో అతడిని కొనుగోలు చేసిన కేకేఆర్ గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదనే చర్చ మొదలైంది. ఇదే ప్రశ్నను కెప్టెన్ అజింక్య రహానెను కామెంటేటర్ అడిగారు. దానికి రహానె ఏమన్నాడంటే..


‘బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని అడ్డుకోవడం పెద్ద సవాలే. ముజరబాని ఐపీఎల్‌కు కొత్త. వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి కుర్రాళ్లు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఇద్దరు అనుభవం ఉన్న స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో మాకు ఓటమి తప్పలేదు. ముంబైలో చాలా ఉక్కపోతగా ఉండటంతో మా బౌలర్లకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదని సందేహం రావడంలో తప్పు లేదు. అయితే అతడు త్వరలోనే బౌలింగ్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఎందుకు చేయించలేదని అడిగితే మాత్రం.. ఆ ప్రశ్నను క్రికెట్ ఆస్ట్రేలియాను అడగమని చెబుతా. ఈ మ్యాచ్‌లో మా కాంబినేషన్ కాస్త భిన్నంగా ప్రయత్నించాం. బ్యాటింగ్‌లో బాగానే ఉన్నప్పటికీ.. బౌలింగ్ యూనిట్ ఇంకాస్త మెరుగ్గా మారాల్సిన అవసరం ఉంది’ అని రహానె వెల్లడించాడు.


క్రికెట్ ఆస్ట్రేలియా ఏమన్నదంటే?

కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె.. మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ‘కొద్దికాలం అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడు. కామెరూన్ గ్రీన్‌ను నడుంనొప్పి ఉంది. అందుకే అతడిని కొన్ని రోజులపాటు బౌలింగ్ చేయొద్దని సూచించాం. ఇదే విషయం కేకేఆర్‌తోనూ చర్చించాం. అతడి పరిస్థితిపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 30 , 2026 | 03:42 PM