రెండేళ్ల నిషేధం సరిపోదు
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:44 AM
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఏదో ఒక నెపంతో వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని మాజీ కెప్టెన్ సునీల్...
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభానికి ముందు ఏదో ఒక నెపంతో వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. టెస్టు కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకు లీగ్‌కు దూరమవుతున్నట్టు ఇటీవలే ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ప్రకటించాడు. వేలంలో డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు తీసుకుంది. ‘ఇలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం ఏమాత్రం సరిపోదు. బీసీసీఐ ఈ విషయంలో పునరాలోచించాలి. మున్ముందు ఏ విదేశీ ఆటగాడికీ ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయాలి’ అని గవాస్కర్ తేల్చాడు.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!