Share News

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:11 PM

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తాను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!
Mary Kom

స్పోర్ట్స్ డెస్క్ : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 2012 లండన్ గేమ్స్‌లో కాంస్యం గెలిచి... ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు అమెచ్యూర్ బాక్సింగ్ వయోపరిమితి దాటడంతో పోటీలకు దూరంగా ఉంటుంది. ఈక్రమంలోనే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందని సమాచారం.


'సండేస్ ఆన్ సైకిల్' అనే కార్యక్రమంలో పాల్గొన్న మేరీకోమ్ మాట్లాడుతూ..' నా క్రీడా జీవితంలో అనేక ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలవడం అద్భుతం. దేశం తరపున అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఇకపై పోటీపడలేని దశకు నేను చేరుకున్నాను. అయితే ప్రొఫెషనల్ బాక్సింగ్‌(Boxing)తో ఒక కొత్త అవకాశం వచ్చింది' అని ఆమె అన్నారు.


'నేను ప్రస్తుతం ప్రొఫెషనల్ బాక్సింగ్ గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుంటున్నాను. నేను ఇంకా ఏమి చేయగలనో ప్రజలకు చూపించడానికి, తిరిగి పుంజుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాను. నేను నా అకాడమీతో చాలా సన్నిహితంగా ఉంటాను. నేను అక్కడ ఉండలేకపోయినప్పటికీ, ఫోన్ కాల్స్ ద్వారా అకాడమీని నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తూ ఉంటాను. వయసుతో సంబంధం లేకుండా, వీలైనంత కాలం ఫిట్‌గా ఉండాలన్నదే నా కల' అని ఆమె అన్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేరీ కోమ్ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌‌గా.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2026: నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!

Updated Date - Mar 29 , 2026 | 04:22 PM