Share News

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:24 PM

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విఫలమవ్వడంతో ఎంఎస్ ధోని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే...

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..
Nitish Kumar Reddy

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ నితీశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి..ధోనీ అభిమానులు నితీశ్‌ను టార్గెట్ చేయడానికి గల కారణం ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చాడు. 23 పరుగులే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని భావించినప్పటికీ.. నితీశ్ కేవలం 6 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఎస్ఆర్‌‌హెచ్ 29 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్ అభినందన సింగ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ధోనీ ఫ్యాన్స్ నితీశ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. నితీష్ బ్యాటింగ్ టెక్నిక్‌ను ప్రశ్నిస్తూ.. నెట్టింట మీమ్స్, పోస్టులతో హోరెత్తిస్తున్నారు.


ధోని అభిమానులు ఇంతగా సెటైర్లు వేయ్యడానికి కారణం నితీశ్ గతంలో ధోనీపై చేసిన వ్యాఖ్యలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2024లో ఓ ఇంటర్వ్యూలో నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధోనీకి ప్రతిభ ఉంది కానీ టెక్నిక్ లేదని, విరాట్ కోహ్లీకి ఉన్నంత టెక్నిక్స్ ధోనీకి లేవంటూ కామెంట్ చేశాడు. ఆ సమయంలోనే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి విఫలమవ్వడంతో ధోనీ అభిమానులు ఆ పాత వీడియో క్లిప్‌లను, కామెంట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్ అని మరికొందరు మద్దతు ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ వైఫల్యం నితీశ్‌ను పాత వివాదంలోకి మళ్ళీ నెట్టేసిందని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

Updated Date - Mar 29 , 2026 | 12:32 PM