పొరపాటున అకౌంట్లో డిపాజిట్ అయిన రూ. 10 కోట్లు.. మహిళ ఏం చేసిందంటే..
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:47 AM
ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు.
లక్నో, మార్చి 29: సాంకేతిక సమస్య కారణంగా ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్‌లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయనని తేల్చి చెప్పారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మెయిన్‌పురి జిల్లాలోని దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన పరస్‌భన్ బహేలియా, రిటా భార్యాభర్తలు. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
నవరాత్రుల సందర్భంగా ఆమె తన అకౌంట్లోని డబ్బులు విత్‌డ్రా చేయడానికి బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. బ్యాంక్ మూసి ఉండటంతో ఏటీఎమ్ దగ్గరకు వెళ్లారు. ఏటీఎమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్న సమయంలో ఆమె అకౌంట్లో 9,99,49,588 రూపాయలు ఉన్నట్లు స్క్రీన్ మీద చూపించింది. దీంతో రీటా ఆశ్చర్యపోయారు. టెక్నికల్ సమస్య కారణంగా అలా చూపిస్తోందేమోనని.. రెండో సారి బ్యాంక్ అకౌంట్‌లోని అమౌంట్‌ను చెక్ చేశారు. మళ్లీ అంతే డబ్బు చూపించింది. అయితే, తన అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నా.. రీటా మాత్రం ఒక్క రూపాయి కూడా తీయలేదు.
తన అకౌంట్లో అంత డబ్బులు ఎందుకు పడ్డాయని తెలిసే వరకు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి తీయకూడదని మిగిలిన కుటుంబసభ్యులకు కూడా చెప్పింది. మరుసటి రీటీ, పరస్‌భన్ బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. బ్యాంక్ హాలీడే అని తెలిసి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటనపై బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ స్పందించారు. సాంకేతిక లోపం లేదా లావాదేవీలో పొరపాటు కారణంగా రీటా అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయని తెలిపారు. బ్యాంక్ తెరిచిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది. జనం రీటాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సుప్రీంలో తేలేదాకా నిజాయితీపరుడు కాలేడు
హౌతీల దాడులతో చర్చలపై ప్రభావం?