Share News

సుప్రీంలో తేలేదాకా నిజాయితీపరుడు కాలేడు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:45 AM

ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులను దిగువ కోర్టు విముక్తి కల్పించటంపై అమిత్‌షా స్పందిస్తూ..

సుప్రీంలో తేలేదాకా నిజాయితీపరుడు కాలేడు

ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులను దిగువ కోర్టు విముక్తి కల్పించటంపై అమిత్‌షా స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తు సంస్థలు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేశాయని గుర్తు చేశారు. కేజ్రీవాల్‌పై కేసు పటిష్ఠంగా ఉందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చేదాకా ‘కరడుగట్టిన నిజాయితీపరుడి’నని ఎవరూ తనకు తాను చెప్పుకోజాలరని వ్యాఖ్యానించారు. దేశంలో నక్సలిజం అంతరించిందని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా.. ‘పేలుళ్లు ఆగిపోయాయంటే నక్సలిజం ముగిసిపోయిందనే అర్థం’ అని బదులిచ్చారు. తిరుపతి-పశుపతినాథ్‌ రెడ్‌కారిడార్‌లో లక్షల మంది గిరిజన సోదర సోదరీమణుల జీవితాల్లో పురోగతి దిశగా కొత్త ఉషోదయం రానుందని చెప్పారు. దేశంలో అన్ని మతాలకూ ఒకే చట్టం ఉండాలని.. ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల సవరణ బిల్లు వివాదాస్పదం కావటంపై అమిత్‌షా స్పందిస్తూ.. నిజమైన ట్రాన్స్‌జెండర్లకు అన్ని సదుపాయాలు లభిస్తాయన్నారు. అయితే, ట్రాన్స్‌జెండర్‌గా ఎవరిని గుర్తించాలన్న దానిపై ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత బిల్లు దీని గురించే చెబుతోందని పేర్కొన్నారు. ఇటీవల ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న ఒక అమెరికన్‌, ఐదుగురు ఉక్రెయినియన్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘మయన్మార్‌లో కొందరు ఉక్రెయిన్‌ దేశస్థులకు అమెరికా శిక్షణ ఇస్తోంది. దానికి హాజరు కావటానికి వీరందరూ ఎటువంటి అనుమతి లేకుండా భారత్‌ మీదుగా వెళ్లటానికి ప్రయత్నిస్తూ దొరికిపోయారు. భారతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు వారిని అరెస్టు చేశాం’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:45 AM