Share News

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:31 AM

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆరంభం మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు.

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్
Phil Salt catches

స్పోర్ట్స్ డెస్క్: మ్యాచ్ విజయాన్ని నిర్ణయించే వాటిల్లో క్యాచెస్ కూడా ఉంటాయి. ఎన్నో మ్యాచ్‌లు ఈ విషయాన్ని నిరూపించాయి. కొన్ని క్యాచుల కారణంగా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. తాజాగా ఐపీఎల్(IPL) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు. సాల్ట్‌ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. ఈ క్యాచులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఫిల్ సాల్ట్(Phil Salt) అందుకున్న మూడు క్యాచులు డేంజర్స్ బ్యాటర్లైన ఇషాన్ కిషన్‌, ట్రావిస్ హెడ్‌, హెన్రిచ్ క్లాసెన్‌లవే కావడం గమన్హారం. ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ చైనాగోడలా నిలిచాడు. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ 2.4 ఓవర్‌లో జాకబ్ డఫీ వేసిన బంతిని ట్రావిస్ హెడ్ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే రెడీగా ఉన్న సాల్ట్ వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన రివర్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో హెడ్‌తో సహా స్టేడియంలోనే ప్రేక్షకులంతా షాకయ్యారు. అలానే షెఫర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికి క్లాసెన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా... బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సాల్ట్‌ దాన్ని అనుహ్యంగా అందుకున్నాడు.


ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్‌ మీద పడ్డట్లు కనిపించింది. కానీ థర్డ్‌ అంపైర్‌ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అలానే ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను సాల్ట్ అందుకున్న తీరు ఒక అద్భుతమనే చెప్పాలి. పక్షికి ఏమాత్రం తీసిపోని విధంగా గాల్లో ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్‌కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్‌ కొట్టిన బంతిని.. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో పట్టుకున్నాడు.


గత సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్‌లో ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు. అలానే ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరంభంలోనే ఆధిక్యం సాధించడానికి ఆర్సీబీకి సహాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

‘చాలెంజర్‌’ ఎవరో?

Updated Date - Mar 29 , 2026 | 11:40 AM