‘చాలెంజర్’ ఎవరో?
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:11 AM
సమకాలీన చెస్‌లో ఉత్తమ క్రీడాకారులు తలపడే ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేళైంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలోని క్యాండిడేట్స్ చెస్ చాంపియన్‌షి్‌పనకు...
నేటి నుంచే క్యాండిడేట్స్ చెస్ బరిలో దివ్య, ప్రజ్ఞానంద, వైశాలి
పీజియా (సైప్రస్): సమకాలీన చెస్‌లో ఉత్తమ క్రీడాకారులు తలపడే ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేళైంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలోని క్యాండిడేట్స్ చెస్ చాంపియన్‌షి్‌పనకు ఆదివారం ఇక్కడ తెరలేవనుంది. ఓపెన్, మహిళల విభాగంలో జరిగే ఈ పోటీల ద్వారా పురుషులు, మహిళల వరల్డ్ చాంపియన్లతో తలపడే ఆటగాళ్ల (చాలెంజర్)ను నిర్ధారిస్తారు. పురుషుల్లో గుకేష్, మహిళల్లో జు వెన్‌జున్ (చైనా) ప్రపంచ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ చెస్ చాంపియన్‌షి్‌ప ఈ ఏడాదిలోనే జరగనుంది. అయితే తేదీలు, వేదికను ఇంకా నిర్ణయించలేదు. ఇక..క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో ఓపెన్ విభాగంలో ఎనిమిది మంది, మహిళల కేటగిరీలో మరో ఎనిమిది మంది బరిలో దిగుతున్నారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో మొత్తం 14 రౌండ్ల పాటు టోర్నీ జరుగుతుంది. పురుషుల్లో భారత్ నుంచి ప్రజ్ఞానంద పోటీపడుతున్నాడు. మహిళల్లో దివ్యా దేశ్‌ముఖ్, వైశాలీ రమే్‌షబాబు తలపడుతున్నారు. తెలుగు జీఎం కోనేరు హంపి కూడా టోర్నీలో ఆడాల్సి ఉన్నా.. సైప్రస్‌లో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ చాంపియన్‌షిప్ నుంచి ఆమె వైదొలగిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు