కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీజేపీ నేతలకు సీఎం రేవంత్ కౌంటర్..
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:22 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని గతంలో అమిత్ షా చెప్పారని, ఆ అవినీతిపై విచారణ జరగాలని అన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీబీఐకి బదిలీ చేస్తే 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని గతంలో అమిత్ షా చెప్పారని, ఆ అవినీతిపై విచారణ జరగాలని అన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీబీఐకి బదిలీ చేస్తే 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, వారి మాటలు నమ్మి కేసును సీబీఐకి అప్పగించామని, ఇప్పటి వరకు చర్యలు లేవని సీఎం విమర్శించారు (Revanth Reddy).
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీశ్ రావును జైలు లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్, హరీశ్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు (Telangana politics).
కేటీఆర్, హరీశ్ రావు ఇసుక మాఫియాతో రూ.వేల కోట్లకు అధిపతులుగా మారారని సీఎం విమర్శించారు. అలాగే పొంగులేటిని హరీశ్ రావు కుటుంబ సభ్యులు బెదిరించారని ఆరోపించారు. హరీశ్ రావు మామ, తమ్ముడు, బావమరిది పేరుపై భూ బదలాయింపు చేయనందుకే పొంగులేటిపై కక్షకట్టారని అన్నారు. భూ దోపిడీపై హౌజ్ కమిటీకి సిద్ధమా అని సవాలు విసిరారు. హౌజ్ కమిటీకి హరీశ్ రావు, కేటీఆర్, వెంకటరమణారెడ్డి సిద్ధమంటే.. వెంటనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..