తొలి రెండు వారాలు ఐపీఎల్‌కు ధోనీ దూరం
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:08 AM
ఐపీఎల్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. తమ అభిమాన ‘తలా’ ఎంఎస్ ధోనీ ఆట కోసం వారంతా...
చెన్నై: ఐపీఎల్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. తమ అభిమాన ‘తలా’ ఎంఎస్ ధోనీ ఆట కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. గాయం కారణంగా అతను రెండు వారాల పాటు లీగ్‌కు దూరం కానున్నాడు. ఎంఎస్ కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. మొత్తంగా ధోనీ ఆరంభ నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో జట్టు కీపింగ్ బాధ్యతలు సంజూ శాంసన్‌కు అప్పగించనున్నారు. ఈనెల 30న రాజస్థాన్‌తో చెన్నై తొలి మ్యాచ్ ఆడుతుంది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు