Share News

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో

ABN , Publish Date - Mar 29 , 2026 | 03:07 PM

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది.

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో
TVK Chief Vijay

చెన్నై: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విజయ్ ఆదివారంనాడిక్కడ విడుదల చేశారు. డ్రగ్స్ రహిత, ఆత్మనిర్భర్ తమిళనాడు తన విజన్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.


'రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పరీక్షలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో నిర్వహిస్తాం. గ్యాడ్యుయేట్లకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,000 చొప్పున నెలవారీ ఆర్థిక సాయం అందిస్తాం. ఉపాధి కోరకునే యువతను ఉపాధి కల్పించే యువతగా తీర్దిదిద్దడం మా లక్ష్యం. స్థానికులకు ఉపాధి పథకం ప్రవేశపెడతాం. 75 శాతం ఉద్యోగాలు తమిళులకే కేటాయిస్తాం. క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్ స్కీమ్ అమలుచేసి క్రియేటర్ల హబ్‌గా తమిళనాడును తీర్దిదిద్దుతాం. రాష్ట్రవ్యాప్తంగా 500 క్రియేటివ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం' అని విజయ్ వాగ్దానం చేశారు.


ఓట్ ఫర్ విజిల్

దీనికిముందు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 234 మంది అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. స్వయంగా పెరుంబూరు, తిరుచిరాలపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఇది విజిల్ రెవల్యూషన్ ఎలక్షన్ అని, విజిల్‌కు ఓటు వేయాలని కోరారు. డీఎంకే-టీవీకే మధ్యనే ప్రధాన పోటీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే ప్రధాన కూటములుగా ఉండగా, తమిళనాడులో ప్రత్నామ్నాయ శక్తి తమదేనని టీవీకే ప్రచారం సాగిస్తోంది. 234 మంది సభ్యుల తమిళ అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్న విజయ్..

శ్రీలంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం.. సంక్షోభం వేళ భారత్‌ సహాయం..

Updated Date - Mar 29 , 2026 | 03:52 PM