Share News

చొరబాట్ల కారిడార్‌గా బెంగాల్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:47 AM

మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసతో బెంగాల్‌.. దేశంలోనే అక్రమ చొరబాటుదార్లకు కీలక కారిడార్‌గా మారిందని...

చొరబాట్ల కారిడార్‌గా బెంగాల్‌

మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసతో బెంగాల్‌.. దేశంలోనే అక్రమ చొరబాటుదార్లకు కీలక కారిడార్‌గా మారిందని అమిత్‌షా ధ్వజమెత్తారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌) ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌ను మమత టార్గెట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. మైనారిటీ ఓటు బ్యాంకును రక్షించుకోవడానికే ఇలా చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సర్‌ జరుగుతోందని.. ఎక్కడా ఇంత రచ్చ చేయలేదన్నారు. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లు దాదాపు ఆగిపోయాయని.. ఇప్పుడు బెంగాల్‌ ఒక్కటే చొరబాట్లకు చిట్టచివరి మార్గంగా మారిందని తెలిపారు. చొరబాట్లను అరికట్టేందుకు బంగ్లాదేశ్‌ సరిహద్దు పొడవునా కంచె వేసేందుకు సహకరించాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసినా మమత అందుకు భూమిని సమకూర్చలేదని ఆరోపించారు. ఈ దఫా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని.. మే 6వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. తర్వాత 45 రోజుల్లోగా కంచె ఏర్పాటుకు అవసరమైన భూమిని కేంద్రానికి అప్పగిస్తుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:47 AM