Share News

శ్రీలంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం.. సంక్షోభం వేళ భారత్‌ సహాయం..

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:33 PM

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్నో దేశాలు ఇంధన, వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో చమురు సంక్షోభం మరింత ఎక్కువగా ఉంది.

శ్రీలంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం.. సంక్షోభం వేళ భారత్‌ సహాయం..
India helps Sri Lanka

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్నో దేశాలు ఇంధన, వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో చమురు సంక్షోభం మరింత ఎక్కువగా ఉంది. ఇంధన సంక్షోభం కారణంగా అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో తమకు ఇంధనం సరఫరా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే భారత్‌ను కోరారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు (India helps Sri Lanka).


శ్రీలంక అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు భారత్ 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని పంపింది (Sri Lanka India fuel aid). ఇందులో డీజిల్ 20 వేల మెట్రిక్ టన్నులు, పెట్రోల్ 18 వేల మెట్రిక్ టన్నులు. తాజాగా కొలంబో నౌకాశ్రయానికి ఇంధనంతో కూడిన నౌక చేరుకున్నట్టు కొలంబోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించినందుకు భారత ప్రభుత్వానికి శ్రీలంక అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేశారు. అక్కడి ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కూడా భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

Updated Date - Mar 29 , 2026 | 01:39 PM