టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్న విజయ్..
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:48 PM
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలు పార్టీల తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టీవీకే అధిపతి విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలు పార్టీల తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టీవీకే అధిపతి విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమ అభ్యర్థులంతా దాదాపు కొత్త వాళ్లేనని విజయ్ ప్రకటించారు (Vijay TVK).
అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా విజయ్ మాట్లాడారు. 'సినిమా వాళ్లు గెలవలేరని విమర్శిస్తున్నారు. విమర్శలకు నా గెలుపుతోనే సమాధానం చెబుతా. మా పార్టీ అభ్యర్థులు ప్రజల రక్షకులు. వారికి అనుభవం లేదని విమర్శిస్తున్నారు. వారంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారు. అనుభవం పేరుతో దోపిడీ చేయడం కంటే, నిజాయితీగా పనిచేసే నాయకులు అవసరం. ఈ అభ్యర్థులు నా ప్రతినిధులు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు' అని విజయ్ పేర్కొన్నారు (TVK candidates list).
ఈ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే జరుగుతాయని, టీవీకే, డీఎంకే మధ్య నేరుగా పోటీ ఉంటుందని విజయ్ పేర్కొన్నారు (Tamil Nadu politics). టీవీకే అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి ఇస్తామని, యువతకు విద్య కోసం రూ.20 లక్షల సహయం చేస్తామని తెలిపారు. అలాగే 75 శాతం ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..