ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:20 PM
చివరి క్షణంలో ఐపీఎల్‌లో ఆడబోమని ప్రకటించే క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. అలా జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన బలంగా లేదని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: చివరి క్షణంలో ఐపీఎల్‌లో ఆడబోమని ప్రకటించే క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. ఐపీఎల్ వేలంలో ఎంపికై.. తీరా లీగ్ ప్రారంభమవుతందనగా ఆటగాళ్లు వైదొలగడం సరైన పద్ధతి కాదని అన్నాడు. అలా జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన బలంగా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ రూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
‘బెన్ డకెట్ గత యాషెస్ సిరీస్‌లో బాగా ఆడాడు. ది హండ్రెడ్ లీగ్‌లో రూ.2 కోట్లు దక్కించుకున్నాడు. అక్కడ మంచి ప్రైస్ రావడంతో ఐపీఎల్‌లో ఆడబోనని ప్రకటించాడు. టెస్టు కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు రావడం లేదని బయటకు చెప్పి ఉండొచ్చు. కానీ అతడు హండ్రెడ్ లీగ్‌లో ఆడనున్నాడనే విషయం అందరికీ తెలుసు. ఇలాంటి సమస్యలకు బీసీసీఐ చెక్ పెట్టాలి. ఇలా చేసే ప్లేయర్లపై బీసీసీఐ విధిస్తోన్న రెండేళ్ల నిషేధం సరిపోదు. అది ఎవరిపైనా ప్రభావం చూపించదు. కాబట్టి బీసీసీఐ కఠినమైన నిబంధనలు తీసుకురావాలి’ అని గావస్కర్ వెల్లడించాడు.
ఆ నిర్ణయం సరిగ్గా అనిపించలేదు..
శనివారం ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైంది. అది ఔటా? నాటౌటా? అనే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ఈ విషయంపై సన్నీ స్పందించాడు. ‘థర్డ్ అంపైర్ మరికాస్త సమయం కేటాయించాలి. సమీక్షించేందుకు తొందర అవసరం లేదు. ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్‌ను టచ్ చేసినట్లు కొందరికి అనిపించింది. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్‌కు అవకాశం రావాలి. అందుకే నాకు ఈ నిర్ణయం సరిగ్గా అనిపించలేదు’ అని సన్నీ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..
ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్