Share News

ఇరాన్‌పై గెలుపు.. మహిళల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:41 AM

భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఇరాన్‌ను 37-34తో ఓడించి ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో పసిడిని అందించింది.

ఇరాన్‌పై గెలుపు.. మహిళల కబడ్డీలో భారత్‌కు స్వర్ణం

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఇరాన్‌ను 37-34తో ఓడించి ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో పసిడిని అందించింది. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమిస్తూ.. చివరి వరకు పోరాట పటిమను ప్రదర్శించిన భారత అమ్మాయిలు చిరస్మరణీయ విజయం సాధించారు.


భారత్-ఇరాన్ మధ్య ఫైనల్‌ పోరు ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. పాయింట్ల కోసం ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. పలుమార్లు ఇరాన్‌ ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో ఇరాన్‌ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకునేలా కూడా కనిపించింది. అయితే.. భారత క్రీడాకారిణులు ఒత్తిడిని జయిస్తూ సమష్టిగా పోరాడారు. కీలక సమయాల్లో ఒక్కో పాయింట్ సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అదే సమయంలో.. మ్యాచ్‌ ముగింపు దశలో అవతలి టీమ్ చేసిన కొన్ని పొరపాట్లు కూడా భారత్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా ప్రత్యర్థి రైడర్లిద్దరూ ఒకేసారి కోర్టులోకి ప్రవేశించడం అవతలి టీమ్‌కు ప్రతికూలంగా మారింది. చివరి విజిల్‌ మోగే సమయానికి స్కోరు 37-34తో భారత్‌ వైపు నిలిచింది. దీంతో ఈ సీజన్లో మూడో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది.



ఇవీ చదవండి:

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Updated Date - Sep 26 , 2026 | 11:43 AM