బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:28 PM
పండుగైనా, పెళ్లైనా, వేడుకైనా.. డప్పుల దరువు వినిపిస్తే చాలు సందడి మొదలవుతుంది. కానీ అదే డప్పుల బీట్‌కు ఓ రోబోట్ అదిరిపోయే స్టెప్పులు వేస్తే? చూసే వాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి, పండుగ, షోరూమ్స్ ప్రారంభోత్సవం వంటి వేడుకల్లో డప్పుల శబ్దం వినిపిస్తే చాలు.. అక్కడి వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారిపోతుంది. అయితే డప్పుల దరువుకు ఓ రోబోట్ మనుషుల్లా స్టెప్పులు వేస్తే.. చూసే వాళ్లు ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ ప్రాంగణం ముందు ఎర్ర తివాచీ పరిచి ఉండగా.. చుట్టూ రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. పక్కనే డ్రమర్లు డ్రమ్స్, సింబల్స్‌ను వాయిస్తుండగా.. నీలం, నారింజ రంగు స్పోర్టీ టీ-షర్ట్, నల్లటి షార్ట్స్, హెల్మెట్ ధరించిన రోబోట్ వారి ముందు ప్రత్యక్షమైంది.
డప్పుల శబ్దం మొదలవగానే ఆ రోబో తనదైన శైలిలో డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బీట్‌కు అనుగుణంగా చేతులు, కాళ్లు, నడుమును కదుపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డ్రమ్స్ లయ మారినప్పుడల్లా దానికి తగ్గట్టుగా తన స్టెప్పులు, టైమింగ్‌ను మార్చడం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో భాంగ్రా తరహా చేతి కదలికలు చేస్తూ, మరికొన్ని సందర్భాల్లో వంగుతూ, తిరుగుతూ రోబోట్ డ్యాన్స్ చేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆసక్తికర వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇకపై డ్యాన్సర్లకు కొదవేలేదు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘రోబోట్ డ్యాన్స్ చూస్తుంటే చిట్టి రోబో గుర్తుకు వస్తున్నాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మాస్ బీట్ పై రోబోట్ డ్యాన్స్ అదుర్స్’ అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి: