కబడ్డీ జట్లకు పతకాలు ఖరారు
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:55 AM
డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషులు, మహిళల కబడ్డీ జట్లు సెమీ్‌సకు చేరి పతకాలు ఖాయం చేసుకొన్నాయి. ఆసియా క్రీడల్లో గురువారం గ్రూప్-ఎలో...
నగోయ: డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషులు, మహిళల కబడ్డీ జట్లు సెమీ్‌సకు చేరి పతకాలు ఖాయం చేసుకొన్నాయి. ఆసియా క్రీడల్లో గురువారం గ్రూప్-ఎలో జరిగిన మ్యాచ్‌లో 37-21తో చైనీ్‌సతైపీపై గెలిచిన భారత పురుషులు.. వరుసగా నాలుగో విజయంతో గ్రూప్ టాపర్‌గా నిలిచారు. కాగా, మహిళల జట్టు 50-25తో జపాన్‌ను చిత్తు చేసింది. వరుసగా మూడో విజయంతో గ్రూప్ టాపర్‌గా ముందంజ వేసింది.
క్వార్టర్స్‌లో తన్వీ, అనాహత్: స్క్వాష్‌లో తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్, వీర్ చోట్రాని క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప-సెంథిల్ కుమార్ ద్వయం మరో భారత జంట సూరజ్-షమీనా రియాజ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సాక్షి అవుట్..: కామన్వెల్త్ పతక విజేత సాక్షి చౌదరి, గాయంతో సుమిత్ కుండూ బాక్సింగ్ ప్రీక్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టగా.. పర్వీన్ హుడాకు వాకోవర్ లభించడంతో క్వార్టర్స్‌కు చేరుకొంది. మహిళల 51 కిలోల రౌండ్-16లో సాక్షి 2-3తో బెలిబెకోవా (కజకిస్థాన్) చేతిలో పరాజయం పాలైంది. మహిళల 65 కిలోల్లో మలికా నజమోవా (కజకిస్థాన్) తప్పుకోవడంతో పర్వీన్‌కు వాకోవర్ లభించింది.
దిల్‌ప్రీత్ హ్యాట్రిక్..: భారత పురుషుల హాకీ జట్టు దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. పూల్-ఎలో భారత్ 8-2తో కొరియాను చిత్తు చేసింది. వరుసగా మూడో విజయంలో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. దిల్‌ప్రీత్ (10వ, 26వ, 32వ నిమిషం) మూడు, అభిషేక్ (15వ, 38వ) రెండు గోల్స్ చేశారు.
రౌండ్-16కు శ్రీజ జోడీ: టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో ఆకుల శ్రీజ, దియ చిటాలే జోడీలు ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నాయి. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో శ్రీజ-దాస్ జోడీ 3-0తో మంగోలియా జంటపై, దివ్య-యశస్విని ఘోర్పడే ద్వయం 3-0తో ఇరాన్ ద్వయంపై గెలిచాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మానుష్ 4-0తో వోంగ్ కి షీన్ (మలేసియా)ను ఓడించి రౌండ్-32కు చేరుకొన్నాడు.
ఈ-స్పోర్ట్స్ పుయో పుయో చాంపియన్స్‌లో (పజిల్ వీడియో గేమ్) పరితోష్ క్వార్టర్స్‌కు చేరుకొన్నాడు. గ్రూప్-బిలో పరితోష్ రెండు విజయాలు, రెండు ఓటములతో మూడో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..