అప్పుడు మల్లి.. ఇప్పుడు మీరా!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:17 AM
ఆసియా క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను తెరదించింది. ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో పతకంతో మురిసింది. 1998లో...
28 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం
రజతంతో మెరిసిన చాను
స్కీట్ షూటర్ల కంచుమోత
బ్యాడ్మింటన్, సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్యాలు
నగోయ: ఆసియా క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను తెరదించింది. ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో పతకంతో మురిసింది. 1998లో కరణం మల్లీశ్వరి (రజతం) తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి పతకం అందించిన లిఫ్టర్‌గా మీరా రికార్డు సృష్టించింది. 2014 నుంచి ఈ క్రీడల్లో పోడియం ఫినిష్ కోసం ఆమె ప్రయత్నిస్తోంది. బుధవారం పోటీల్లో మీరా రజత ప్రదర్శనకు తోడు.. షూటింగ్‌లో స్కీట్ పురుషుల, మహిళల జట్లు కంచుమోత మోగించాయి. బ్యాడింటన్ పురుషుల జట్టు, సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకొన్నారు. ఉషు క్రీడలో రోషిబినా దేవి ఫైనల్లో అడుగుపెట్టి కనీసం రజతం ఖాయం చేసుకుంది. మొత్తంగా నాలుగో రోజు భారత్ ఓ రజతంతోపాటు 4 కాంస్యాలు దక్కించుకొంది.
పుష్కరం కల: ఆసియాడ్‌లో పతకం సాధించాలనే 12ఏళ్ల తన కలను మీరాబాయి చాను ఎట్టకేలకు నెరవేర్చుకొంది. మహిళల 49 కిలోల విభాగంలో చాను మొత్తం 198 (87+111) కిలోల బరువు ఎత్తి రెండో స్థానంతో రజత పతకం కైవసం చేసుకుంది. 2014లో తొలిసారి బరిలోకి దిగిన మీరా తొమ్మిదో స్థానంలో నిలవగా.. 2018లో వెన్నెముక గాయంతో దూరమైంది. ఇక, 2023 క్రీడల్లో నాలుగో స్థానంతో త్రుటిలో పతకం చేజార్చుకొంది. ఉత్తర కొరియా లిఫ్టర్ రి సాంగ్ గమ్ 215 (94+121) హ్యాట్రిక్ స్వర్ణాన్ని దక్కించుకోగా..ఇండోనేసియా అథ్లెట్ విజయన డయానా 191 (88+103) కాంస్యం సొంతం చేసుకొంది.
షూటర్ల డబుల్ ధమాకా: స్కీట్ షూటింగ్‌లో పురుషులు, మహిళల జట్లు కాంస్యాలతో అదరగొట్టాయి. రైజా డిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పెరినాజ్ దలీవాల్‌లతో కూడిన మహిళల జట్టు మొత్తం 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చైనా (357), కజకిస్థాన్ (336) స్వర్ణ, రజతాలు దక్కించుకొన్నాయి. పురుషుల్లో అనంత్‌జీత్, భవతేగ్ సింగ్, మైరాజ్ అహ్మద్‌ఖాన్‌ల త్రయం 346 పాయింట్లతో తృతీయ స్థానం సొంతం చేసుకొంది. కతార్ (353), కువైట్ (348) స్వర్ణ, రజతాలు సొంతం చేసుకొన్నాయి.
మనూ బృందం విఫలం: మనూ భాకర్, హైదరాబాదీ ఇషా సింగ్, సురుచి సింగ్‌తో కూడిన భారత బృందం షూటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. వీరు ముగ్గురు 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో నిరాశపరిచారు. వ్యక్తిగత విభాగంలో ఇషా, సురుచి ఫైనల్ చేరలేకపోయారు. ఇక.. వ్యక్తిగత విభాగంలో టైటిల్‌ఫైట్‌కు చేరిన మనూ భాకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగం ఫైనల్లో మను, ఇషా, సురుచి బృందం నాలుగో స్థానంలో నిలిచింది.
సాత్విక్ జోడీ మినహా..: సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి వైఫల్యంతో పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకొంది. సెమీ్‌సలో భారత్ 1-3తో చైనా చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో సేన్ ఓడినా.. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గెలిచి 1-1తో సమం చేశారు. కానీ, మరో సింగిల్స్‌తో ఆయు్‌షతోపాటు డబుల్స్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్ జంట ఓడడంతో భారత పరాజయం ఖరారైంది.
జై మీనా చరిత్ర..
సాఫ్ట్ టెన్నిస్‌లో దేశానికి తొలి ఆసియాడ్ పతకం అందించిన ఆటగాడిగా మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల జై మీనా చరిత్ర సృష్టించాడు. సింగిల్స్ సెమీఫైనల్లో మీనా 2-4తో టకుయా కురుసోకా (జపాన్) చేతిలో ఓడి కాం స్యం దక్కించుకొన్నాడు.
పతకాల పట్టిక
దేశం స్వ ర కాం మొ
1 చైనా 48 20 10 78
2 జపాన్ 15 25 27 67
3 ద. కొరియా 8 8 25 41
4 కజకిస్థాన్ 7 4 8 19
5 థాయ్‌లాండ్ 5 3 4 12
13 భారత్ 1 5 6 12
గమనిక- స్వ: స్వర్ణం; ర: రజతం కాం: కాంస్యం; మొ: మొత్తం
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు