Home » Sports and Others
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ మరోసారి కాంస్య పతకం సాధించాడు. పురుషుల 87 కేజీల విభాగంలో 9-0తో గెలిచి, ఆసియా క్రీడల్లో రెండు గ్రీకో-రోమన్ పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు.
గాయాల కారణంగా ఎంతో మంది అథ్లెట్ల కెరీర్‌లు అర్ధంతరంగా ముగిశాయి. ఇలాంటి ప్రమాదాలకు టెక్నాలజీతో చెక్‌పెట్టేలా హైదరాబాద్‌కు చెందిన జాతీయస్థాయి షూటర్ హోమన్షిక రెడ్డి (21) ఓ పరికరం ‘సోమట్రేస్’ను ఆవిష్కరించింది.
భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఇరాన్‌ను 37-34తో ఓడించి ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడో పసిడిని అందించింది.
ఆంధ్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరికి ఆసియా క్రీడల్లో కీలక బాధ్యత దక్కింది. ఆమె భారత బ్యాడ్మింటన్ జట్టు అధికారిక ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.
మూడో అనధికార టీ20లో ఆస్ట్రేలియా-ఎ 168/5 స్కోరు చేసి భారత్-ఎను 161 పరుగులకే ఆలౌట్ చేసింది. వ్రింద దినేష్ 69 పరుగులతో రాణించినా భారత్-ఎకు 7 పరుగుల ఓటమి తప్పలేదు.
తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్...
డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోరులో భారత్ 3-2 ఆధిక్యంతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. తొలిరోజు సింగిల్స్‌లో సత్తా చాటిన యువ ఆటగాడు దక్షిణేశ్వర్ సురేష్....
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది. ఫైనల్‌లో రెండుసార్లు డ్రాగా ముగిసిన తర్వాత టై బ్రేకర్‌లో దివ్య గెలుపు దక్కించుకుంది.
ప్రస్తుత వెస్టిండీస్ జట్టులోని ఓ స్టార్ క్రికెటర్ లైంగిక ఆరోపణల వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులు, అత్యాచారం తదితర ఆరోపణలతో ఓ మైనర్ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై గయానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు విండీస్ మీడియా పేర్కొంది.
పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఏ పరిస్థితుల్లోనూ జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు