దక్షిణేశ్వర్ అదుర్స్
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:51 AM
డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోరులో భారత్ 3-2 ఆధిక్యంతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. తొలిరోజు సింగిల్స్‌లో సత్తా చాటిన యువ ఆటగాడు దక్షిణేశ్వర్ సురేష్....
డేవిస్ కప్‌లో నెదర్లాండ్స్‌పై 3-2తో విజయం
క్వాలిఫయర్స్ రౌండ్-2కు భారత్
బెంగళూరు: డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోరులో భారత్ 3-2 ఆధిక్యంతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. తొలిరోజు సింగిల్స్‌లో సత్తా చాటిన యువ ఆటగాడు దక్షిణేశ్వర్ సురేష్.. రెండోరోజు కూడా భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. శనివారం తొలి సింగిల్స్‌లో సుమిత్ ఓడగా, రెండో సింగిల్స్‌లో దక్షిణేశ్వర్ గెలవడంతో స్కోరు 1-1తో సమమైన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజైన ఆదివారం తొలుత డబుల్స్‌లో యుకీ/దక్షిణేశ్వర్ జోడీ 7-6(0), 3-6, 7-6 (1)తో డచ్ జంట సాండర్/డేవిడ్‌పై నెగ్గడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకెళ్లింది. కానీ, రివర్స్ సింగిల్స్‌లో సుమిత్‌ను 5-7, 6-1, 6-4తో జెస్సర్ డి జాంగ్ ఓడించడంతో 2-2తో స్కోరు సమమైంది. దీంతో నిర్ణాయక రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ఒత్తిడిలో బరిలోకి దిగిన దక్షిణేశ్వర్ 6-4, 7-6 (4)తో గుయ్ డెన్ ఓడెన్‌ను చిత్తుచేశాడు. ఫలితంగా నెదర్లాండ్స్‌పై 3-2 ఆధిక్యం అందుకున్న భారత్.. డేవిస్ కప్ క్వాలిఫయర్స్-2కు అర్హత సాధించింది. ఈ పోరులో దక్షిణేశ్వర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం విశేషం.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..