జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:38 PM
మూడు టీ20ల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో రాయ్పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో రాయ్పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే తొలుత బ్యాటింగ్కు దిగనుంది. అయితే పూర్తి స్థాయి కెప్టెన్గా స్మృతి మంధానకు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్తో కర్ణాటకకు చెందిన యువ ప్లేయర్ నికీ ప్రసాద్ అరంగేట్రం చేయనుంది.
భారత తుది జట్టు:
స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, అనుష్క శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీచరణి, అరుంధతీ రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్
ఇవి కూడా చదవండి:
విండీస్తో ఐదో టీ20: అర్ష్దీప్ సింగ్కు గాయం.. భువీకి పిలుపు
మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్