రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:28 PM
రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళా జట్లు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 8.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(55; 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ స్మృతి మంధాన(47*; 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించింది. అనుష్క శర్మ(1*) నాటౌట్‌గా నిలిచింది. జింబాబ్వే బౌలర్లలో బిజా మాత్రమే వికెట్ తీయగలిగింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. తిరుపనో(34) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో నికీ ప్రసాద్ 2, క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి శర్మ, నందనీ శర్మ తలొక వికెట్ పడగొట్టారు. కాగా ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 మంగళవారం జరగనుంది.
ఇవి కూడా చదవండి:
విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా