జింబాబ్వేతో రెండో టీ20: చెలరేగిన బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Oct 18 , 2026 | 08:40 PM
రాయ్పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. భారత్కు 103 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. కిపో ముగెరి తిరిపనో(34) టాప్ స్కోరర్.
భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కెలిస్(0), బిజా(7), మైయర్స్(9), జోసెఫైన్(27), నైషా(0), ముపాచికా(9), మావుంగా(4), చిపారే(0) పరుగులు చేశారు. భారత యువ ఆల్రౌండర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. తన అంతర్జాతీయ డెబ్యూ వికెట్లు ఇవే కావడం విశేషం. క్రాంతి గౌడ్, నందని శర్మ, దీప్తి శర్మ, శ్రీచరణి తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా