Share News

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:39 PM

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్న అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గుర్తింపునిచ్చింది.

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్న అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గుర్తింపునిచ్చింది. ఐదు టీ20ల సిరీస్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచిన శ్రేయస్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ మెడల్‌ను అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వెస్టిండీస్‌తో సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌తో పరుగుల వరద పారించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 181 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 45.25 సగటుతో పాటు 205.68 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. లఖ్‌నవూ వేదికగా జరిగిన తొలి టీ20లోనే శ్రేయస్‌ తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఏడో భారత పురుష క్రికెటర్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు.


సిరీస్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో టీమిండియా ట్రైనింగ్‌ అసిస్టెంట్‌ నువాన్‌ సేనవిరత్నే.. శ్రేయస్‌కు మెడల్‌ను అందించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో శ్రేయస్‌ ఒకడని, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో జట్టు ముందుండి నడిపించాడని ఈ సందర్భంగా ప్రశంసించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. వర్షం, పరుగులు, డ్రెస్సింగ్‌ రూమ్‌ సందడి.. ఇలా సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ చుట్టూ జరిగిన విశేషాలను వీడియోలో చూపించింది. ఇదిలా ఉంటే, భారత్-వెస్టిండీస్ ఐదు టీ20ల సిరీస్ సమం అయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

కివీస్ టెస్టు సిరీస్‌కు ముందు నిరాశపరిచిన గిల్.. వీడియో వైరల్

విండీస్ క్రికెట్‌కు ఆర్థికంగా అండగా నిలవండి: కోచ్ డారెన్ సామీ

Updated Date - Oct 18 , 2026 | 05:40 PM