Share News

కివీస్ టెస్టు సిరీస్‌కు ముందు నిరాశపరిచిన గిల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:43 PM

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రంజీ ట్రోఫీలో చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ తరఫున ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు.

కివీస్ టెస్టు సిరీస్‌కు ముందు నిరాశపరిచిన గిల్.. వీడియో వైరల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రంజీ ట్రోఫీలో చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ తరఫున ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అజయ్ మండల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్.. బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్య నుంచి దూసుకొచ్చిన బంతిని అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో అతడి డిఫెన్స్‌పై క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో స్పిన్నర్లను ఎదుర్కొనే విషయంలో గిల్ తన టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు గిల్ ఇలా ఔట్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


భారత జట్టు వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో గిల్‌కు రంజీ మ్యాచ్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని భావించారు. న్యూజిలాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పాటు స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై కూడా సవాలు విసిరే అవకాశముంది. అందుకే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఎక్కువ సమయం క్రీజులో గడపడం గిల్‌కు ఎంతో కీలకం. అయితే, ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔటవడంతో తన ఆటను పరీక్షించుకునే అవకాశాన్ని అతడు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయాడు.


ఈ వార్తలనూ చదవండి:

సీఎస్‌కే, కేకేఆర్ కాదు.. హార్దిక్ పాండ్యా ఆ జట్టులోకి వెళ్లొచ్చు: అశ్విన్

డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్‌ వేలం

Updated Date - Oct 18 , 2026 | 03:43 PM