టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:17 PM
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్‌పైనే నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు(గురువారం) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టుకు పిచ్, వాతావరణ పరిస్థితులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటం వల్ల కొంత అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమ్.. మొదటగా బౌలింగ్ చేసే అవకాశముంది. గత రికార్డులను పరిశీలిస్తే.. వాంఖడేలో ఛేజింగ్ చేసిన జట్టే అత్యధిక సార్లు విజయం సాధించాయి. దీంతో నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పోరులో టాస్ ముఖ్యపాత్ర పోషించనుంది. పిచ్ పరిస్థితులు, వాతావరణ ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇరు జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
సాధారణంగా.. టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టు పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని మైదానాల్లో మొదట బ్యాటింగ్ చేయడం వల్ల ఆయా టీమ్‌లకు అనుకూలం కాగా.. మరికొన్ని చోట్ల మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులభంగా మారుతుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ప్రత్యర్థిపై వ్యూహాత్మకంగా ఆధిక్యం సాధించే అవకాశం ఉంటుంది. ఇక ముంబై పిచ్ విషయానికొస్తే.. ఇక్కడ రెండోసారి బ్యాటింగ్ చేయడం చాలా తేలిక కానుంది. కావున ఛేజింగ్ చేసిన జట్లే అత్యధికంగా విజయం సాధించాయి. అయితే.. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మాత్రం కొన్నిసార్లు ఈ విధానం బెడిసి కొట్టింది.
ఇక.. భారత్, ఇంగ్లండ్ టీమ్‌లను పరిశీలిస్తే ఇరు జట్లూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో టాస్ తర్వాత తీసుకునే నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో చిన్న తప్పిదం కూడా జట్టు అవకాశాలను ప్రభావితం చేసే ప్రమాదముంది. పిచ్ పరిస్థితులను పరిశీలించి టాస్ గెలిచిన జట్టు మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ సెమీఫైనల్ పోరులో టాస్ ఫలితం మ్యాచ్‌పై ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక పోరులో ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుందో చూడాలి. ఏది ఏమైనా.. టాస్ అనేది ఒక ప్రారంభ ప్రయోజనం మాత్రమే. అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన టీమ్‌నే అంతిమంగా విజయం వరిస్తుంది.
ఇవీ చదవండి:
ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్
మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా