Share News

నువ్వా..నేనా?

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:30 AM

సెమీ్‌సలో భారత్‌-ఇంగ్లండ్‌ ఢీ నేడు ఫ వరుసగా రెండో ఫైనల్‌పై టీమిండియా గురి టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా కీలక సమరానికి సన్నద్ధమైంది.. పటిష్ట ఇంగ్లండ్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల పరంగా సమవుజ్జీలుగా...

నువ్వా..నేనా?

రాత్రి 7 గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

టీ20 వరల్డ్‌కప్‌

సెమీ్‌సలో భారత్‌-ఇంగ్లండ్‌ ఢీ నేడు ఫ వరుసగా రెండో ఫైనల్‌పై టీమిండియా గురి టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా కీలక సమరానికి సన్నద్ధమైంది.. పటిష్ట ఇంగ్లండ్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఇరుజట్లూ నాకౌట్‌ చేరే క్రమంలో చెరో పరాజయాన్ని చవిచూశాయి. గ్రూప్‌ దశలో బ్రూక్‌ బృందం, సూపర్‌ 8లో సూర్య సేన ప్రత్యర్థుల చేతిలో కంగుతిన్నా.. అనూహ్యంగా పుంజుకొని ఆఖరి అంకానికి అడుగు దూరంలో నిలిచాయి. ఈ మెగా టోర్నీ సెమీ్‌సలో వరుసగా మూడోసారి ముఖాముఖికి సిద్ధమయ్యాయి. గత రెండు పర్యాయాల్లో చెరో గెలుపుతో సమంగా ఉన్న వీళ్లలో.. ఈమారు ఫైనల్‌ చేరేదెవరు? ఓటమితో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించేదెవరు?

ముంబై: టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌.. మరో బిగ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీ్‌సలో బలమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌ మ్యాచ్‌ల్లో ఎలాగొలా నెట్టుకొచ్చినా.. సూపర్‌-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడడంతో టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. కానీ, ఆ తర్వాత కొంతవరకు మెరుగైన నిర్ణయాలతో ముందంజ వేసింది. ముఖ్యంగా ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం వ్యూహాత్మకంగా కలసి వచ్చింది. శాంసన్‌ జట్టులోకి వచ్చి దశాబ్దంపైగానే అయింది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వ్యర్థం చేసుకొన్న శాంసన్‌.. ఎట్టకేలకు సత్తాచాటాడు. వెస్టిండీ్‌సతో కీలక పోరులో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును సెమీస్‌ చేర్చాడు. నాకౌట్‌ మ్యాచ్‌లో శాంసన్‌ నుంచి జట్టు ఇదే తరహా ప్రదర్శనను ఆశిస్తున్నా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఫామ్‌ కోల్పోవడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. స్పిన్నర్‌ విల్‌ జాక్స్‌ రూపంలో అభిషేక్‌కు గండం పొంచి ఉంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌.. తన ఐపీఎల్‌ హోంగ్రౌండ్‌లో మరోసారి మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ తమ బ్యాట్లకు పనిచెప్పాలి. మిడిలార్డర్‌కు మార్చిన తర్వాత తిలక్‌ ప్రదర్శన ఆకట్టుకొంటోంది. అయితే, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపలేక పోతుండడం జట్టుకు మైన్‌సగా మారింది. వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో అతడు భారీగానే పరుగులు సమర్పించుకొన్నాడు. బుమ్రా రాణిస్తున్నా.. మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో నిలకడ లోపించింది. ఆరో బౌలర్‌గా శివం దూబేను సూర్య ఎలా వాడుకొంటాడో చూడాలి. గత మ్యాచ్‌లో ఆడిన జట్టును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉండడంతో కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది.


రషీద్‌తో డేంజర్‌..

మరోవైపు స్పిన్‌ బలంతో ఇంగ్లండ్‌ ప్రత్యర్థులను వణికిస్తోంది. సూపర్‌-8లో అద్భుత ప్రదర్శనతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ జట్టుకు మూలస్తంభాలుగా మారారు. ఓపెన్‌ బట్లర్‌ విఫలమవుతున్నా.. సాల్ట్‌, సామ్‌ కర్రాన్‌ ఆదుకొంటున్నారు. ఓవర్టన్‌ పవర్‌ప్లేలోనే వికెట్లు పడగొడుతున్నాడు. మిడిల్‌ ఓవర్లలో డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే.

జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌.

ఇంగ్లండ్‌: ఫిల్‌ సాల్ట్‌, బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), బ్రూక్‌ (కెప్టెన్‌), బాకబ్‌ బెథల్‌, టామ్‌ బాంటన్‌, కర్రాన్‌, విల్‌ జాక్స్‌, ఓవర్టన్‌, లియామ్‌ డాసన్‌, ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌.

పిచ్‌/వాతావరణం

ఈ మ్యాచ్‌ కోసం మధ్యలో ఉన్న పిచ్‌-7ను ఉపయోగించనున్నారు. ఇరువైపులా బౌండ్రీ సమాన దూరంలో ఉంటుంది. ఈ వికెట్‌పై వెస్టిండీ్‌సతో ఇంగ్లండ్‌ తలపడగా.. నేపాల్‌కు ఇటలీ షాకిచ్చింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు

Updated Date - Mar 05 , 2026 | 05:30 AM