Share News

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:42 PM

టీ20 ప్రపంచ కప్ 2026 వ్యూయర్‌ షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ఈ మ్యాచులను వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు.

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీ ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ వ్యూయర్‌షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ఈ టోర్నీలో జరిగిన మ్యాచులను వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు.


‘ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ 2026ను అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా మార్చాలనే ఆశయంతో ప్రారంభించాం. భారతదేశంలో ఈ ఈవెంట్‌కు వీక్షకుల సంఖ్య 50 కోట్లు(500 మిలియన్లు) దాటింది. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధికం. జియో హాట్ స్టార్ వీక్షకుల సంఖ్య 6.05కోట్లకు (60.5 మిలియన్లు) చేరుకుంది. ఈరోజు నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. వీటిని కూడా భారత అభిమానులు వీక్షించి.. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నాం అని జై షా ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా.. నేటి నుంచి సెమీ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ 1 మ్యాచ్ జరగనుంది. అలాగే మార్చి 5 (గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. మార్చి 8 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

టీ20 డబ్ల్యూసీ: నేడే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!

Updated Date - Mar 04 , 2026 | 02:59 PM