ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:09 PM
ఐపీఎల్ 2026 సందడి మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మేనన్ తాజాగా ధ్రువీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి వేదికలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మేనన్ తాజాగా ధ్రువీకరించారు. కాగా ఆర్సీబీ 5 మ్యాచ్‌లను తన హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామిలోనే ఆడనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే ఓ ప్లే ఆఫ్ మ్యాచ్‌తో పాటు, ఫైనల్ మ్యాచ్ కూడా ఈ మైదానంలోనే జరగనుంది. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. షెడ్యూల్‌ను బీసీసీఐ అతి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గర్జన మరోసారి ప్రతిధ్వనించనుంది’ అని సంతోష్ మేనన్ వెల్లడించాడు.
అది మా ఉనికి..
ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడటంపై ఆ ఫ్రాంచైజీ సీఈఓ రాజేశ్ మేనన్ స్పందించారు. ‘చిన్నస్వామి స్టేడియం మాకు హోం గ్రౌండ్ కంటే ఎక్కువ. ఇది మా ఉనికి. బెంగళూరు అభిమానుల ఉత్సాహమే మా ఆటగాళ్లకు ఇంధనం. ప్రతి దశలోనూ వారు క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. మా ఫ్యాన్స్ మాకు మద్దతు తెలిపారు. వారి అభిమాన జట్టు బెంగళూరులో ఆడటాన్ని చూసేందుకు వారు పూర్తి అర్హులు’ రాజేశ్ మేనన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..
టీ20 డబ్ల్యూసీ: నేడే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!