9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:09 AM
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది. గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20(T20 Match) మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్(West Indies) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్ల హేలీ మాథ్యూస్ (8), ఎబోని బ్రాత్‌వైట్ (8), షవ్నిషా హెక్టార్ (5) దారుణంగా విఫలమయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్ (24), డియాండ్రా డొట్టిన్ (28), చిన్నెల్ హెన్రీ (32 *) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో విండీస్ 100 పరుగుల మార్క్ దాటింది. లంక బౌలర్లలో రణవీర , సుగంధిక కుమారి చెరో రెండు వికెట్లు సాధించారు. అలానే కవిష దిల్హరి ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. హాసిని పెరీరా (52 ), కెప్టెన్ చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 ) చక్కగా రాణించారు. ఈ క్రమంలో 17.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయిన లంక జట్టు 121 పరుగులు చేసింది. అర్ధ సెంచరీతో రాణించిన హాసినిప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్ ఆద్యంతం రాణించిన శ్రీలంక కెప్టెన్ చమారి(Chamari Athapaththu) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ను దక్కించుకున్నారు.
3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక వెస్టిండీస్‌లో(Sri Lanka Women vs West Indies Women) పర్యటిస్తోంది. తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న లంక ...తాజాగా టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. కాగా.. టీ20 ప్రపంచ కప్2026లో పురుషుల శ్రీలంక జట్టు సూపర్-8 నుంచి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో పురుషుల జట్టు అభిమానులకు ఆగ్రహం తెప్పించగా.. తాజాగా లంక మహిళల జట్టు కాస్త ఊరట నిచ్చింది.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: నేడు సౌతాఫ్రికాతో మ్యాచ్.. కివీస్19 ఏళ్ల పగ తీరేనా?
టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?