Share News

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:15 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య అయితే ఏకంగా రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన  పాండ్య..
Hardik Pandya net practice

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు(బుధవారం) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. గురువారం ముంబై వేదికగా సెమీస్-2లో భారత్, ఇంగ్లండ్(India vs England) తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా మ్యాచ్ గెలిచి.. ఫైనల్ బెర్తు కన్ఫర్మ్ చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ కీలక పోరుకు కేవలం ఒక రోజు సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో టీమిండియా జట్టు నెట్ సెషన్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. గత మ్యాచుల్లో తాము చేసిన తప్పులను సరిచేసుకుంటూ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం భారత్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య నెట్‌లో ప్రత్యేకంగా నిలిచాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


నిన్న(మంగళవారం) చంద్రగ్రహణం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను ఆలస్యంగా ప్రారంమైన సంగతి తెలిసిందే. టీమిండియా ప్లేయర్లు సాయంత్రం 6 గంటలకు నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా 7:30 గంటల ప్రారంభించారు. అయితే ఈ సెషన్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 2 గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. పాండ్య బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను నిశితంగా పరిశీలించారు. టీమిండియా బౌలర్లు వేసిన విభిన్నమైన బాల్స్ ను ఆడుతూ పాండ్య(Hardik Pandya) బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇదే సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్.. పాండ్యకు కొన్ని కీలక సూచనలు, బ్యాటింగ్ విషయంలో మెలుకువలు చెప్పాడు.


మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైన రాత్రి 7:30కి ప్రారంభం కాగా 10:10 గంటలకు ముగిసింది. ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు పాండ్య నెట్ లో బ్యాటింగ్ పైనే ఫోకస్ చేశాడు. అతను తన పవర్‌ హిట్టింగ్‌ను మెరుగుపరచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపించాడు. రేపు జరిగే సెమీ ఫైనల్-2లో బ్యాటింగ్‌లో బాగా రాణించాలనే కసితో హర్ధిక్ ఉన్నట్లు కనిపించాడు. అతనికి నెట్స్ నిజంగా పనిచేశాయా లేదా అనేది మనకు గురువారం వాంఖడే స్టేడియంలో(Wankhede Stadium) జరిగే మ్యాచ్‌లో మాత్రమే తెలుస్తుంది. వాంఖడే స్టేడియం పిచ్‌పై మంచు ప్రభావం ఉండొచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: నేడే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!

9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం

Updated Date - Mar 04 , 2026 | 01:04 PM