టీ20 డబ్ల్యూసీ: నేడే న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:14 AM
టీ20 ప్రపంచకప్ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌ను దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. తిరుగులేని ఫామ్‌తో అజేయంగా దక్షిణాఫ్రికా సెమీస్‌లో చోటు సంపాదిస్తే.. కివీస్ కష్టంగా ముందంజ వేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(బుధవారం) దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ జట్లు తొలి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ తుది పోరుకు అర్హత సాధించడమే లక్ష్యంగా ఇరు జట్లు కసితో ఉన్నాయి.
సౌతాఫ్రికా:
సెమీస్‌లో సఫారీ జట్టునే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందనడంలో సందేహం లేదు. ఆ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అప్రతిహత విజయాలతో సాగుతోంది. గ్రూపు దశలోనూ, సూపర్-8లోనూ సౌతాఫ్రికా జట్టు ఓడిపోలేదు. ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో పోటీకి సిద్ధమైంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై గెలవడం సౌతాఫ్రికాను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది.
న్యూజిలాండ్:
ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.. ప్రొటీస్ జట్టును నిలువరించాలంటే న్యూజిలాండ్ గొప్పగా పుంజుకోవాల్సింది. దక్షిణాఫ్రికా అంత భీకరంగా కనిపించకపోయినా కివీస్‌కు కూడా మంచి లైనప్పే ఉంది. ఓపెనర్లు శుభారంభాన్నివ్వాలని కివీస్ కోరుకుంటోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్‌పై ఫిలిప్స్, మిచెల్, రచిన్ కూడా బ్యాట్ ఝళిపించడం న్యూజిలాండ్ కు చాలా అవసరం. మొదట బ్యాటింగ్ చేస్తే.. 200పై స్కోరు సాధిస్తేనే కివీస్ పోటీలో నిలవగలుగుతుంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్ స్పిన్నర్లకు సహకరించక పోవచ్చు. అయితే పేసర్లకు మాత్రం పిచ్ నుంచి సాయం లభించనుంది. ఇక వాతావరణం విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ అనుకోకుండా వాన ఆటకం కలిగించినా సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఆ రోజు ఆట కూడా రద్దైతే సూపర్-8 దశను మెరుగ్గా ముగించిన జట్టు ముందంజ వేస్తుంది.
ఇరు జట్ల అంచనా:
సౌతాఫ్రికా:
డికాక్, రికెల్టన్, మార్‌క్రమ్ (కెప్టెన్), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.
న్యూజిలాండ్:
అలెన్, సీఫర్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్ సోధి.
ఇవి కూడా చదవండి:
9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం
టీ20 డబ్ల్యూసీ: నేడు సౌతాఫ్రికాతో మ్యాచ్.. కివీస్19 ఏళ్ల పగ తీరేనా?