Share News

ఇంగ్లండ్‌తో తొలి టీ20: టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌కు నో ఛాన్స్

ABN , Publish Date - Jul 01 , 2026 | 09:42 PM

రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఇంగ్లండ్‌తో తొలి టీ20: టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌కు నో ఛాన్స్
India vs England

ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. గాయం బారిన పడి ఆటకు దూరమైన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. రీఎంట్రీ ఇచ్చాడు.


భారత్ తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్ తుది జట్టు:

హ్యారీ బ్రూక్(కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), బెథెల్, టిమ్ బాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహ్‌మూద్, ఆదిల్ రషీద్, వుడ్


ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 01 , 2026 | 09:44 PM