కెప్టెన్ అవుతానని నాకెప్పుడో తెలుసు : శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:52 PM
భారత జట్టు టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. నేడు ఇంగ్లండ్‌తో భారత్ తొలి టీ20లో తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. అతడి నాయకత్వంలో ఐర్లాండ్‌తో ఆడిన తొలి సిరీస్‌లోనే భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతోంది. నేడు ఇంగ్లండ్‌తో భారత్ తొలి టీ20లో తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. టీ20 జట్టుకు కెప్టెన్సీ చేస్తానని తనకు ముందే తెలుసని వెల్లడించాడు. ఆ నిర్ణయం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదని తెలిపాడు.
‘ఏదో ఒక రోజు టీ20 జట్టుకు కెప్టెన్ అవుతానని నేను ముందే భావించాను. గత ఐపీఎల్ సీజన్లలో, భారత్ తరఫున కూడా అద్భుత ప్రదర్శనలే చేశాను. అందుకే ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. చిన్నప్పటి నుంచి భారత జట్టు తరఫున ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే కేక్ ఐసింగ్‌లాంటిది. ఇది నాకు ఎంతో గర్వకారణం. నా కష్టానికి, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతుకు దక్కిన ఫలితం ఇది’ అని అయ్యర్ వెల్లడించాడు.
ఒత్తిడిలోనే నా ఆట బయటపడుతుంది..
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ప్రయాణం ఆశించిన విధంగా ప్రారంభం కాలేదు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. అయినా తాను ఒత్తిడిని ఆస్వాదిస్తానని, సవాళ్లను స్వీకరించేందుకే ఇష్టపడతానని అయ్యర్ స్పష్టం చేశాడు. ‘నేను ఎప్పుడూ సవాళ్లను కోరుకుంటాను. ఒత్తిడిలోనే అత్యుత్తమ ప్రదర్శన చేయగలను. సవాళ్లను స్వీకరించి జట్టును విజయపథంలో నడిపించడమే నా లక్ష్యం’ అని అయ్యర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్