న్యూజిలాండ్ టూర్: భారత జట్ల ప్రకటన.. ఆ మ్యాచ్లకు గిల్ దూరం
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:22 PM
భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్న సుదీర్ఘ పర్యటనలో ఐదు టీ20లు, 2 టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు వచ్చే నెలలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్న సుదీర్ఘ పర్యటనలో ఐదు టీ20లు, 2 టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్కు సంబంధించిన భారత జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. కాగా తొలి మూడు వన్డే మ్యాచ్లకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. 4,5 వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆఖరి రెండు వన్డేలకు గిల్, కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ దూరం కానున్నారు. వీరి ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, ఆకిబ్ నబీ, కుమార కుషాగ్రా, యశ్ ఠాకూర్ ఆడనున్నారు. ఇక టెస్టు జట్టు విషయానికొస్తే, మహ్మద్ షమీకి సెలెక్టర్లు ఈ సారి కూడా అవకాశం ఇవ్వలేదు. గాయం బారిన పడిన ఆకాశ్ దీప్ తిరిగి జట్టులో చేరాడు.
భారత జట్టు(తొలి మూడు వన్డేలకు):
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
భారత జట్టు(4,5 వన్డేలకు):
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, కుమార్ కుషాగ్ర, సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్
భారత టెస్టు జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్
వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్